4, జులై 2010, ఆదివారం

వినురవేమ

ఈ మధ్య వేమన పద్యాలు రెండు నేర్చుకొంది- ఉప్పుకప్పురంబు , అల్పుడెప్పుడు పలుకు . ఓ రోజూ నిద్రపోయే ముందు ఆ రెండు పాడి వినిపించింది. ఇంకొకటి పాడమని అడిగా . ఇంక రావు నాన్నా అంది . ఆలోచించు అన్నా . ఒక్క క్షణం ఆగి
" రాత్రయింది బాబు
నిద్రొస్తుంది బాబు
రేపు స్కూలుకెళ్లాలి బాబు
విశ్వధాబి రామ వినురవేమ "
అని పాడింది .:)

24, మే 2010, సోమవారం

బయటి తిండి

వంట్లో బాలేక డాక్టరు దగ్గర తీసుకెళ్తే ఆయన "జంక్ ఫుడ్ " తినొద్దు అని చెప్పాడు . బయటకి రాగానే రెస్టారంట్ కి వెళ్దాం అంది . "ఇప్పుడే కదా డాక్టరు బయట తినోద్దన్నారు " అన్నా - "బయటేందుకు నాన్నా , రెస్టారంట్ లోపలే తిందాం " :):):)

11, ఫిబ్రవరి 2010, గురువారం

చంద్రుడికి నీళ్ళు ఎవరిస్తారు ?

ఇవాళ పొద్దున్ననీళ్ళు తాగమని  అన్నప్పుడు : "నాన్నా  చంద్రుడికి    నీళ్ళు ఎవరిస్తారు ? "
మళ్లీ  తనే :  "కృష్ణ  ఇస్తాడు  . బృందావనం అక్కడే  కదా  ఉంది "  :)

16, జనవరి 2010, శనివారం

చంద్రుడి కథ :)

రోజూ నిద్ర పోయేముందు ఆరోజు బళ్ళో ఏమి చెప్పారో , తను తన స్నేహితులతో ఏమేమి ఆడిందో కథలు చెప్తుంది . నిన్న రాత్రి తన బళ్ళో నవ గ్రహాలు గురించి చెప్పినట్టున్నారు. నేను అడిగా -"అమ్మలూ చంద్రుడు అక్కడ ఎలా పడి పోకుండా ఉన్నాడు? " "కొంతమంది విమానం లో చంద్రున్ని తీసుకెళ్ళి tape పెట్టి గట్టిగా అంటించి వచ్చారు"

ఎవరి పేరు వాళ్ళే రాసుకోవాలి : )

స్పూర్తి కి అప్పుడప్పుడు తన పని తనే చేసుకోవాలని చెప్తూ ఉంటాం . తను ఆడుకొన్నాక తన బొమ్మలు తనే సర్దుకోడం లాంటివి . ఈ మధ్యే బళ్ళో అక్షరాలు నేర్పారు , రాయడం. తెలిసిన అక్షరాలతో పదాలు రాయిస్తూ ఉంటాం . మొన్న కొన్ని పదాలకి spelling చెప్తుంటే రాస్తూ ఉంది . తన పేరు కూడా చెప్పాము . రాసింది .. తరువాత అమ్మపేరు చెప్పాము .. బలపం పడేసి " ఎవరి పేరు వాళ్ళే రాసుకోవాలి" అని వెళ్లి పోయింది :D